పీఎం నరేంద్ర మోడికి లైన్ క్లియర్

పీఎం నరేంద్ర మోడికి లైన్ క్లియర్

ప్రధాని మోడీ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా పీఎం నరేంద్ర మోడీ.  ఈ సినిమా ఏప్రిల్ 5 వ తేదీన దేశవ్యాప్తంగా రిలీజ్ కాబోతున్నది.  ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.  వివేక్ ఒబెరాయ్ నటించిన ఈ సినిమా రిలీజ్ కాకుండా అడ్డుకోవాలని కొంతమంది ఢిల్లీ హై కోర్ట్ ను ఆశ్రయించారు.  సినిమాను రిలీజ్ చేస్తే.. ఎన్నికలపై దాని ప్రభావం చూపుతుందని పిటిషనర్లు పిటిషన్లో పేర్కొన్నాడు.  

ఈ పిటిషన్ ను విచారించిన ఢిల్లీ హైకోర్ట్.. పిటిషిషన్ ను కొట్టేసింది.  దీంతో పీఎం మోడీ సినిమా రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది.  ఎన్నికలకు ముందు సినిమా రిలీజ్ కావడం శుభసూచకమని బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.