దిశ కేసుపై ఢిల్లీ హైకోర్ట్ వార్నింగ్ - స్పందించకుంటే భారీ జరిమానా...!!

దిశ కేసుపై ఢిల్లీ హైకోర్ట్ వార్నింగ్ - స్పందించకుంటే భారీ జరిమానా...!!

2019 డిసెంబర్ లో దిశ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.  దిశపై అత్యాచారం, హత్య ఉదంతం దేశం మొత్తాన్ని కుదిపేసింది.  ప్రతి ఒక్కరు ఈ కేసుపై స్పందించారు.  మీడియాలో అనేక కథనాలు వచ్చాయి.  దిశ నిందితులను పోలీసులు పట్టుకోవడం, ఆ తరువాత కొన్ని కారణాల వలన నిందితులను ఎన్ కౌంటర్ చేయడం జరిగిపోయాయి. 

అయితే, ఇలాంటి ఘటనలు జరిగినపుడు బాధితుల పేర్లు, ఫోటోలను సోషల్ మీడియా, మీడియాలో ఫోకస్ చేయకూడదు.  చట్టం దీనికి ఒప్పుకోదు.  డీ విషయంపై ఢిల్లీ హైకోర్టులో కేసు దాఖలైంది.  ఈ కేసును విచారించిన ఢిల్లీ హైకోర్టు సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ కు వార్నింగ్ ఇచ్చింది.  దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది.  నాలుగు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని, లేదంటే రూ. 10 లక్షల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.  తదుపరి విచారణను మే 4 కు వాయిదా వేసింది.