35 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

35 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో టీమిండియా చేతులెత్తేసింది. సిరీస్ ఫలితం తేల్చే మ్యాచ్ లో భారత్ ఘోర పరాజయం పొందింది. 273 పరుగుల లక్ష్యఛేదనలో భాగంగా బ్యాటింగ్‌ ప్రారంభించిన భారత జట్టు కేవలం 237 పరుగులకు అలౌట్ అయింది. దీంతో ఆస్ట్రేలియా 35 పరుగుల తేడాతో విజయం సాధించి, 3-2 తేడాతో సిరీస్ గెలుచుకుంది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసి.. 56 పరుగులకు ఔటయ్యాడు. మిగతా బ్యాట్స్‌మెన్లు ఇలా వచ్చి అలా పెవిలియన్ కు చేరారు. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (12)‌, కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (20), రిషబ్‌ పంత్‌ (16), విజయ్‌ శంకర్‌ (16) తక్కువ పరుగులకే పెవిలియన్‌ బాట పట్టారు. రవీంద్ర జడ్డేజా డకౌట్‌ అయ్యారు. చివర్లో కేదార్ జాదవ్(44), భువనేశ్వర్ కుమార్ (46) జట్టును ఆదుకునే ప్రయత్నం చేసిన సఫలం కాలేకపోయారు. ఆసీస్ బౌలర్లలో ఆడం జంపా మూడు వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ లియాన్‌, పాట్ కుమ్మిన్స్, స్టోయినిస్ రెండేసి వికెట్లు, నాథన్ లయన్ కు ఓ వికెట్ దక్కింది.  

అంతకు ముందు నిర్ణిత 50 ఓవర్లలో ఆసీస్ 9 వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుక్ను ఆసీస్‌ ఫించ్‌ (27), ఖవాజా (100), హ్యాండ్స్‌కోంబ్‌ (52) మెరవడంతో భారీ స్కోరు దిశగా దూసుకెళ్లింది. కానీ 30 ఓవర్ల తర్వాత టీమిండియా బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో కంగారూ జట్టు వేగానికి కళ్లెం వేశారు. 33వ ఓవర్‌లో చక్కని బంతితో భువనేశ్వర్‌ ఖవాజాను ఔట్‌ చేశాడు. రెండు ఓవర్ల తర్వాత జడేజా ఊరిస్తూ వేసిన ఆఫ్‌ స్పిన్‌ బాల్‌కు హిట్టింగ్‌కు వెళ్లి మ్యాక్స్‌వెల్‌ కోహ్లీ చేతికి చిక్కాడు. 37వ ఓవర్‌ రెండో బంతికి ధాటిగా ఆడుత్నున్న హ్యాండ్స్‌కోంబ్‌ను షమీ బోల్తా కొట్టించాడు. స్టొయినిస్‌ను భువీ, అలెక్స్‌ కరేను షమీ ఔట్‌ చేయగా.. 4వ వన్డే హీరో టర్నర్‌ను స్పిన్నర్‌ కుల్దీప్‌ పెవిలియన్‌ పంపాడు.