అక్కడ ట్రాఫిక్ చలానాలు వెనక్కి.. షరతులు వర్తిస్తాయి..!! 

అక్కడ ట్రాఫిక్ చలానాలు వెనక్కి.. షరతులు వర్తిస్తాయి..!! 

దేశంలో ట్రాఫిక్ రూల్స్ పాటించకుంటే ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందో అందరికి తెలిసిందే.  ఈ విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు.  అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు.  రూల్స్ కు విరుద్ధంగా ప్రవర్తిస్తే.. విధించే చలానాలు దారుణంగా ఉంటున్నాయి.  ఇక హైవేలపై కూడా స్పీడ్ ను నియంత్రించేందుకు స్పీడ్ గన్ లను ఏర్పాటు చేసి.. ఆ స్పీడ్ మించి ప్రయాణం చేసిన వాహనాలకు జరిమానా విధిస్తున్నారు.  

ఆగస్టు నుంచి అక్టోబర్ 10 వ తేదీ వరకు 24 నెంబర్ జాతీయ రహదారిపై అత్యధిక వేగంతో వెళ్లిన 1.5 లక్షల వాహనాలకు జరిమానాలు విధించారు.  ఇలా విధించిన జరిమానాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది.  దీనికి కారణం లేకపోలేదు.  24వ నెంబరు జాతీయ రహదారిపై గరిష్ఠ వేగం గంటకు 70 కిలోమీటర్లుగా సూచిక బోర్డు ఉంది. కానీ స్పీడ్‌గన్‌లలో 60 కిలోమీటర్ల వేగ పరిమితినే నిక్షిప్తం చేసి ఉన్నది.  ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి స్పీడ్ బోర్డులను మార్చమని చెప్పినా అలా చేయలేదని, ఫలితంగా 70 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే వాహనాలకు జరిమానాలు విధించారని ట్రాఫిక్ పోలీస్ విభాగం పేర్కొన్నది. తప్పును గ్రహించిన ట్రాఫిక్ పోలీస్ శాఖ విధించిన 1.5 లక్షల జరిమానాలు వెనక్కి తీసుకుంది.  24 వ నెంబర్ జాతీయ రహదారిపై స్పీడ్ పోస్టులను మార్చేపనిలో పడింది.