క్లైమేట్ మాయ... ఊటీగా మారిపోయిన ఢిల్లీ.. 

క్లైమేట్ మాయ... ఊటీగా మారిపోయిన ఢిల్లీ.. 

దేశంలో వాతావరణం క్షణక్షణానికి మారిపోతున్నది.  అక్టోబర్ 27 తరువాత ఢిల్లీలో వాతావరణం దారుణంగా మారిపోయింది.  దీపావళి టపాసుల మోతతో ఢిల్లీ మొత్తం పొగ కమ్మేసింది.  చాలా వరకు షరతులు, పరిమితులు విధించినా పొల్యూషన్ మాత్రం తగ్గడం లేదు.  ఢిల్లీలో ఈ పొగధూళితో కూడిన పొల్యూషన్ నిండిపోవడం.. చిన్నపాటి వర్షం కురవడంతో... ఢిల్లీని ఆ పొగమొత్తం కమ్మేసింది.  

ఓ వైపు చల్లని గాలులు వేస్తుండటం... పైన పొగతో కూడిన మంచులాంటి వాతావరణం ఉండటంతో.. అసలు మనం ఉన్నది ఢిల్లీలోనా లేదంటే ఊటీలో ఉన్నామా అనే అనుమానం కలుగుతుంది.  వాతావరణం ఆహ్లాదకరంగా ఉన్నట్టు కనిపించినా.. దాని వెనుక చాలా పెద్ద ప్రమాదం కూడా ఉన్నది.