అమూల్‌ హల్ది దూద్‌కు డిమాండ్‌

అమూల్‌ హల్ది దూద్‌కు డిమాండ్‌

భిన్న ఉత్పత్తులతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న అమూల్‌ కంపెనీ ఇటీవల ప్రవేశపెట్టిన  అమూల్‌ హల్దీ దూద్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. పసుపు ఉన్న ఈ పాలను కంపనీ ఇటీవలే మార్కెట్‌లోకి తెచ్చింది. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఇపుడు  ఈ పాలను ప్రవేశపెట్టారు. ఆసియాలోనే అతి పెద్ద పాల కంపెనీ అయిన అమూల్‌...నేటి తరానికి కూడా నచ్చే విధంగా పసుపు పాలను తయారు చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.  త్వరలోనే అన్ని ప్రాంతాలకు విస్తరిస్తామని పేర్కొన్నాయి. 200 మి.లీ. ఉన్న క్యాన్‌ ధర రూ.30. హల్దీ దూద్‌తోపాటు తొలిసారిగా ఐరిస్‌  డ్రింక్‌  మాక్‌టైల్‌ను కూడా మార్కెట్‌లోకి తెచ్చింది అమూల్.