ఎఫ్3 కు డిమాండ్‌లు పెరుగుతున్నాయా?

ఎఫ్3 కు డిమాండ్‌లు పెరుగుతున్నాయా?

ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ నారప్ప షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. అయితే నారప్పను త్వరగా ముగించుకుని అనిల్ రావిపుడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఎఫ్3 సినిమాలో నటించనున్నాడు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ రెండో హీరోగా చేయనున్నారు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే మొదటగా ఈ సంక్రాంతికి విడుదలైన ఎఫ్2 ప్రేక్షకుల దగ్గర మంచి మార్కులను సంపాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ తీసేందుకు అనిల్ రావిపుడి సిద్దమయ్యాడు. కరోనా లాక్‌డౌన్ సమయంలో ఎఫ్3 స్ర్కిప్ట్‌ను సిద్దం చేశారు. ఈ సీక్వెల్‌ను కూడా దిల్ రాజు తీసేందుకు ముందుకొచ్చారు. అయితే ఈ సినిమా హీరోలు, దర్శకుడి వద్ద నుంచి డిమాండ్‌లు భారీగా వస్తున్నాయని నిర్మాత అన్నారు. దిల్ రాజ్ ఎప్2ను డీసెంట్ బడ్జెట్‌తో ముగించారు. అయితే ఎఫ్3కు దర్శకుడు అనిల్ పారితోషికం భారీగా అడుగుతున్నాడట. సరిలేరు నీకెవ్వరు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ తన రెమ్యూనిరేషన్ పెంచేశాడట. అదే తరహాలో హీరోలు కూడా పెంచారని నిర్మాత అంటున్నారు. హీరో వరుణ్ తేజ్ కూడా ఈ సినిమా క్రేజ్‌ను బట్టి తన రెమ్యూనిరేజన్ పెంచడంతో పాటుగా, మరో హీరో వెంకటేష్‌తో సమానంగా తన పాత్రా ఉండాలని డిమాండ్ చేస్తున్నాడట. అయితే డీసెంట్ బడ్జెట్‌తో ఎఫ్2 విడుదల చేసి నిర్మాత మంచి లాభాలను అందుకున్నాడు. ఇప్పుడు కరోనా తరువాత తక్కువ ఖర్చుతో చేయాల్సిన సమయంలో డిమాండ్స్ రావడం నిర్మాతకు భారంగా మారనున్నాయని ఇండస్ట్రీలో అనుకుంటున్నారు.