కరకట్ట వెంట అక్రమ కట్టడాలు కూల్చివేత..

కరకట్ట వెంట అక్రమ కట్టడాలు కూల్చివేత..

కృష్ణా కరకట్ట వెంట ఉన్న అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు.. తాళ్లాయపాలెంలో అక్రమ కట్టడాల కూల్చివేతకు పూనుకున్నారు.. కరకట్టపై ఉన్న శైవ క్షేత్రంకు పక్కనే నిర్మించిన బాత్‌రూమ్‌లు, క్యాంటిన్లను కూల్చివేశారు అధికారులు. కాగా, ఈ శైవ క్షేత్రాన్ని శివ స్వామి అనే వ్యక్తి నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. సీఆర్డీఏ అధికారి మధుసూదనరావు ఆధ్వర్యంలో కరకట్ట వెంట ఉన్న అక్రమకట్టడాల కూల్చివేత కార్యక్రమం కొనసాగుతోంది. ఇక, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏపీలో అక్రమ నిర్మాణాలు కూల్చివేతలపై ప్రభుత్వం దృష్టిసారించింది.. ముఖ్యంగా రాజధాని ప్రాంతం.. కృష్ణానది కరకట్ట అక్రమాల కూల్చివేతకు యాక్షన్‌ ప్లాన్‌ రెడీ చేసిన సంగతి తెలిసిందే.