డెన్మార్క్ ఓపెన్ లో సింధూకు షాక్

డెన్మార్క్ ఓపెన్ లో సింధూకు షాక్

భారత స్టార్ షట్లర్ పీవీ సింధుకు పెద్ద షాక్. ఎన్నో అంచనాలతో డెన్మార్క్ ఓపెన్‌లో బరిలో దిగిన సింధు తొలి రౌండ్‌లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించింది. తొలి రౌండ్లో అమెరికన్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి బీవెన్ జంగ్ చేతిలో అనూహ్య ఓటమిని చవిచూసింది. 56 నిమిషాల పాటు జరిగిన హోరాహోరీ పోరులో సింధు 17-21, 21-16, 18-21 తేడాతో ఓటమి చవిచూసింది. జంగ్ చేతిలో సింధు ఓడిపోవడం వరుసగా ఇది మూడోసారి. ఈఏడాది ఫిబ్రవరిలో ఇండియన్ ఓపెన్ ఫైనల్లోనూ సింధుపై అమెరికన్ షట్లర్‌దే పైచేయి కావడం గమనార్హం. టోర్నమెంట్లో మూడో సీడ్‌గా బరిలో దిగిన సింధు గత కొద్దిరోజులుగా తన మునుపటి ప్రదర్శనను కనబర్చలేకపోతోంది. కచ్చితంగా పతకంతో తిరిగొస్తుందని ఆశించిన అభిమానులకు నిరాశే మిగిలింది. దాదాపు గంట పాటు వీరిద్దరూ హోరాహోరీగా పోరాడారు. మరోవైపు... సైనా నెహ్వాల్ హాంకాంగ్ కు చెందిన న్యాన్ యే చూయింగ్ ను ఓడించింది. సైనా 20-22,21-17,24-22 తేడాతో సైనా గెలిపొందింది. వీరు ఇద్దరు గంటన్నర పోరాడారు.