ట్రైన్ చైన్ లాగిన 20ఏళ్ల తరువాత.. ఎంపీపై కేసు..!! 

ట్రైన్ చైన్ లాగిన 20ఏళ్ల తరువాత.. ఎంపీపై కేసు..!! 

ఎప్పుడో 20 ఏళ్ళక్రితం అంటే 1997 లో గురుదాస్ పూర్ ఎంపీ, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ లు బజరంగ్ సినిమా చిత్రీకరణ సమయంలో ట్రైన్ చైన్ లాగారని అభియోగాలు వచ్చాయి.  రాజస్థాన్ లోని అజ్మిర్ జిల్లాలోని ఫులేరా సమీపంలో ఈ సినిమా షూటింగ్ జరుగుతున్నది.  ఆ సమయంలో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ లు సమీపంలో ఉన్న నరేనా రైల్వే స్టేషన్లోకి వచ్చి అప్ లింక్ ఎక్స్ ప్రెస్ చైన్ లాగారని, ఫలితంగా రైలు 25 నిముషాలు ఆలస్యం అయ్యి ప్రయాణికులు ఇబ్బంది పడ్డారని చెప్పి నరేనా రైల్వే స్టేషన్ అసిస్టెంట్ మేనేజర్ వీరిపై రైల్వే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.  

అయితే, 2009లో రైల్వే కోర్టు వీరిపై అభియోగాలు నమోదు చేసింది.  దీంతో సన్నీ డియోల్, కరిష్మా కపూర్ లు సెషన్స్ కోర్టు ఆశ్రయించారు.  సెషన్స్ కోర్టు వీరిపై ఉన్న అభియోగాలను కొట్టేసింది.  కాగా, సెప్టెంబర్ 17వ తేదీన రైల్వే కోర్టు వీరిపై తిరిగి అభియోగాలు నమోదు చేసింది.  దీంతో సన్నీ డియోల్, కరిష్మా కపూర్లు తిరిగి సెషన్స్ కోర్టును ఆశ్రయించారు.