ఈవీఎంలతోనే నిజామాబాద్ ఎన్నికలు !

ఈవీఎంలతోనే నిజామాబాద్ ఎన్నికలు !

 

త్వరలో జరగబోయే తెలంగాణ లోక్ సభ ఎన్నికలల్లో నిజామాబాద్ స్థానం ప్రత్యేకంగా నిలవనుంది.  ఈ స్థానం నుండి ఏకంగా 180 మందికి పైగా రైతులు పోటీలో నిలుస్తున్నారు.  గిట్టుబాటు ధర కల్పించడంలేదని నిరసనగా ఇలా సిట్టింగ్ ఎంపీ కవితపై పోటీకి దిగారు వీరంతా.  ఇంతమంది ఒకేసారి పోటీ చేస్తుండటంతో ఎన్నికల నిర్వహణపై ఎన్నికల కమీషన్ ఆలోచనలో పడింది.  మొదట బ్యాలెట్ బాక్సుల ద్వారా ఎన్నికలు జరపాలని అనుకున్నా ఇప్పుడు ఈవీఎంల ద్వారా జరపడమే ఉత్తమమని నిర్ణయించుకుంది.   ఇంతమంది బరిలో ఉన్నప్పుడు ఈవీఎంలను, వీవీప్యాట్ పరికరాల్ని ఉపయోగించడం ఇదే మొదటసారని, మొత్తం 1788 పోలింగ్ స్టేషన్లకు గాను 25000 బ్యాలెట్ యూనిట్స్ 2000 కంట్రోల్ యూనిట్స్ అవసరమవుతాయని డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ ఉమేష్ సిన్హా అన్నారు.