ఇంటర్వ్యూ : దేవదాస్ ను చాలా ప్రేమించాను- రష్మిక
ఛలో సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన రష్మిక సెకండ్ సినిమా గీత గోవిందంతో టాలీవుడ్లోనే లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. మూడో ప్రయత్నంగా నాగ్, నానీల మల్టీ స్టారర్ దేవదాస్ సినిమాలో నటించింది. ఈ సినిమా సెప్టెంబర్ 27 న విడుదల కాబోతున్నది. ఈ సందర్భంగా రష్మిక మందన మీడియాతో చిట్ చాట్ చేశారు. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
దేవదాస్ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది. గీత గోవిందంలాగానే హీరోతో సమానంగా ఉంటుందా..?
గీత గోవిందం సినిమా వేరు.. దేవదాస్ సినిమా వేరు. గీత గోవిందంలో గీత ఉంది. గీత పాత్ర గోవిందంతో సమానంగా ఉంటుంది. ఇది దేవదాస్. ఇందులో దేవా నాగ్ సర్, దాస్ నానీల మధ్య ఎక్కువగా కథ నడుస్తుంది. వాళ్లతో కలిసి నా జర్నీ ఎలా ఉంది అన్నది ఇందులో ఉంటుంది.
ఇందులో మీ జర్నీ ఎలా సాగింది..?
ఇందులో నాది పూజ పాత్ర. చాలా ఫన్నీగా ఉంటుంది. సెట్స్ లో బాగా ఎంజాయ్ చేశాను. మీరు సినిమా చూస్తే తప్పకుండా అర్ధం అవుతుంది.
సీనియర్ స్టార్ నాగార్జునతో, నానిలతో కలిసి పనిచేశారు కదా. ఆ అనుభవం ఎలా ఉంది..?
నాగార్జున సర్ నేను రెండు రోజులు మాత్రమే షూటింగ్ లో పాల్గొన్న. ఆ రెండు రోజుల్లో నేను చాలా నేర్చుకున్నాను. నాగ్ సర్ చాలా సరదాగా ఎప్పుడు నవ్వుతు కూల్ గా ఉంటారు. అదే ఆయన ఆరోగ్య రహస్యం అనుకుంటా. నానిగారితో కలిసి పనిచేయడం వలన చాలా విషయాలు తెలుసుకున్నాను. నాకు ఏదైనా సందేహం వస్తే నాని తీర్చేవారు. తన నటనను ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలో.. ఇంకా ఎలా చేయాలా అని నిత్యం ఆలోచిస్తూ ఉంటారు. ఇద్దరితో కలిసి పనిచేయడం వలన నటనకు సంబంధించి చాలా నేర్చుకున్నాను.
ఈ సినిమాలో ఆఫర్ ఎలా వచ్చింది..?
గీత గోవిందం సినిమా చేసే సమయంలో ఈ అఫర్ వచ్చింది. ఒకసారి వెళ్లి స్వప్న మేడమ్ కలిశాను. పెద్ద బ్యానర్. సీనియర్ ప్రొడ్యూసర్స్ హౌస్. అవకాశం వస్తుందా అనుకున్నా. చిన్న ఆడియన్ తరువాత నన్ను పూజ పాత్ర కోసం తీసుకున్నారు.
దేవదాస్ గురించి మీరు ఏమనుకుంటున్నారు..?
టాలీవుడ్ లో ఇది నా మూడో సినిమా. ఛలో, గీత గోవిందం సినిమాలను హిట్ చేశారు. దేవదాస్ కూడా హిట్ అవుతుందనే నమ్మకంతో ఉన్నాను. తప్పకుండా హిట్ అవుతుంది. సినిమా అంతా చాలా ఫన్నీగా ఉంటుంది.
మీ నెక్స్ట్ సినిమాలు ఏంటి..?
నా గీత గోవిందం హీరో విజయ్ దేవరకొండతో డియర్ కామ్రేట్ సినిమాలో చేస్తున్నాను. మరికొన్ని సినిమాలు లైన్లో ఉన్నాయి. ఓకే అయితే తప్పకుండా తెలియజేస్తాను.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)