సెన్సార్ పూర్తిచేసుకున్న 'దేవదాస్' !

సెన్సార్ పూర్తిచేసుకున్న 'దేవదాస్' !

శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జున, నానిలు కలిసి నటించిన చిత్రం 'దేవదాస్'.  పూర్తిస్థాయి ఫన్ తో రూపొందించబడిన ఈ సినిమా ఆ నెల 27న రిలీజ్ కానుంది.  కొద్దిసేపటి క్రితమే చిత్ర సెన్సార్ పనులు పూర్తయ్యాయి. 

సెన్సార్ బోర్డు సినిమాకు యు/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది.  ఆరంభం నుండి మంచి బజ్ కలిగి ఉన్న ఈ సినిమా మంచి విజయం సాదిస్తుందని నాగార్జున, నానిలు చాలా నమ్మకంగా ఉన్నారు.  ఈ చిత్రంలో ఆకాంక్ష సింగ్, నాని సరసన రష్మిక మందన్న నటించారు.  ఈ చిత్రంలో నాగార్జున డాన్ పాత్రలోను, నాని డాక్టర్ పాత్రలోను కనిపించనున్నారు.  వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్విని దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు.