ఇంటర్వ్యూ : సరదాగా జరిగింది.. శ్రీరామ్ ఆదిత్య

ఇంటర్వ్యూ : సరదాగా జరిగింది.. శ్రీరామ్ ఆదిత్య

సుధీర్ బాబు భలే మంచిరోజు, నారా రోహిత్ శమంతకమణి సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి.  ఈ రెండు సినిమాల తరువాత శ్రీరామ్ ఆదిత్య జానర్ ను మార్చి.. పూర్తి ఎంటర్టైనర్ సినిమా దేవదాస్ తీశాడు.  ఈ సినిమా ఈ నెల 27 న రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని సొంతం చేసుకున్నది.  ఈ సందర్భంగా శ్రీరామ్ ఆదిత్య మీడియాతో సరదాగా ముచ్చటించారు.  ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.  

1. దేవదాస్ విజయం సాధించింది కదా ఎలా ఫీలవుతున్నారు..? 

దేవదాస్ సినిమాపై పూర్తి భరోసా ఉంది.  నమ్మకంతో పనిచేశాం.  ఆ నమ్మకమే నిలబెట్టింది.  ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రీసీవ్ చేసుకుంటున్నారు.  చాలామంది సన్నిహితులు నాకు మెసేజ్ లు పెట్టారు.  ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు.  ఇంతకంటే ఇంకేంకావాలి.  

2. అసలు దేవదాస్ సినిమా ఎలా ప్రారంభమైంది..?

శమంతకమణి తరువాత ఓ మంచి కథ అనుకోని దానిపై మూడు నెలలు పాటు కూర్చొని కథను రెడీ చేశాను.  ఆ తరువాత నాగార్జున గారికి, నాని గారికి చెప్పడంతో వారు కూడా ఒప్పుకున్నారు.  స్క్రిప్ట్ రెడీ చేసి షూట్ కు వెళ్ళాం.  

3. నాగ్, నాని లు ఇద్దరు పెద్ద స్టార్స్ కదా వారిని డీల్ చేయడం కష్టం అనిపించలేదా.? 

అసలు కష్టం అనిపించలేదు.  చెప్పాలంటే షూటింగ్ అంతా చాలా సరదాగా గడిచిపోయింది.  ఎక్కడ ఇబ్బంది పడ్డట్టు కనిపించలేదు.  ఇద్దరు స్టార్స్ ను ఒకే స్క్రీన్ పై చూస్తుంటే ఆనందంగా ఆనందం వేసేది.  సీన్ ను ఇంకా బాగా చేయాలని అనిపించేది.  

4. సినిమా ఎండింగ్ చూస్తుంటే సీక్వెల్ కు అవకాశం ఉండేలా కనిపించింది.. ?

సీక్వెల్ చెయ్యొచ్చు.  కానీ, ఇప్పుడు ఆ ఆలోచన లేదు.  దేవదాస్ హిట్ అయింది.  ఇప్పుడు ఆ హిట్ ను ఎంజాయ్ చేస్తున్నా.  ఒకవేళ సీక్వెల్ చేయాలనుకుంటే ఈ స్టార్స్ తోనే మరలా చేస్తాను.  

5. సినిమా గురించి మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి..?

సినిమా చూశాక నాగార్జున గారు ఫోన్ చేసి బాగా తీశావని మెచ్చుకున్నారు.  సినిమా రిలీజ్ తరువాత మొదటగా వచ్చిన కాల్ అది.  అదే బెస్ట్ కాంప్లిమెంట్.  

6. నెక్స్ట్ ఏ సినిమాలు చేస్తున్నారు..? 

ఇంకా ఏమి అనుకోలేదు.  గత సంవత్సరం కాలంగా ఈ సినిమాకు పనిచేశాను.  సక్సెస్ సాధించాం.  ప్రస్తుతం ఎంజాయ్ చేస్తున్న.