తొలిరోజు 'దేవదాసు' వసూళ్లు !
నాగార్జున, నానిల 'దేవదాస్' చిత్రం నిన్న విడుదలైన సంగతి తెలిసిందే. మల్టీస్టారర్ చిత్రం కావడంతో తొలిరోజు వసూళ్లు మంచి స్థాయిలోనే ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా సినిమా 6.57 కోట్ల షేర్ రాబట్టింది. అత్యధికంగా నైజాం ఏరియాలో 1.68కోట్లు వసూలు చేసిన సినిమా సీడెడ్లో 73 లక్షలు, ఉత్తరాంధ్రలో 58 లక్షలు, గుంటూరులో 52 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 39 లక్షలు, వెస్ట్ గోదావరిలో 26 లక్షలు, కృష్ణాలో 32 లక్షలు, నెల్లూరులో 19 లక్షలు వసూలు చేసింది. ఇక శని, ఆదివారాలు వారాంతపు సెలవులు కావడంతో ఈ వసూళ్లు ఇలాగే కొనసాగే సూచనలున్నాయి.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)