రివ్యూ : దేవదాస్

రివ్యూ : దేవదాస్

నటీనటులు : నాగార్జున, నాని, రష్మిక, ఆకాంక్ష సింగ్, కునాల్ కపూర్, నవీన్ చంద్ర, నరేష్, మురళీ శర్మ, వెన్నెల కిషోర్ తదితరులు 

మ్యూజిక్ : మణిశర్మ 

సినిమాటోగ్రఫీ : షమదత్ సైనుద్దీన్ 

నిర్మాత : అశ్వినీదత్ 

దర్శకత్వం : శ్రీరామ్ ఆదిత్య 

రిలీజ్ డేట్ : 27-09-2018

నాగ్, నానీలు హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ సినిమా దేవదాస్.  ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది.  ప్రీమియర్ షోల నుంచి పాజిటివ్ టాక్ రావడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగాయి.  మరి ఆ సినిమా ఎలా ఉందొ ఇప్పుడు చూద్దామా.  

కథ : 

నాగార్జున ఓ డాన్. తనకు తనకు తండ్రిలాంటివాడైన శరత్ కుమార్ ను ఓ ముఠా హత్య చేస్తుంది.  ఈ విషయం తెలుసుకున్న నాగార్జున ఆ ముఠాను వెతుక్కుంటూ నాగార్జున హైదరాబాద్ వస్తాడు.  నాగార్జున హైదరాబాద్ రాగానే అతనిపై పోలీసులు ఎటాక్ చేస్తారు.  వాళ్ళనుంచి తప్పించుకునే క్రమంలో నాగార్జునకు గాయలవుతాయి.  ఈ క్రమంలో నాగ్.. వైద్యుడైన నానిని కలుస్తాడు.  నాగ్, నానీల మధ్య స్నేహం ఏర్పడుతుంది.  ఆ తరువాత ఏం జరిగింది అన్నది మిగతా కథ.  

విశ్లేషణ : 

నాగ్, నానీలు ఇద్దరు ఒకేసారి తెరపై కనిపించడం అభిమానులకు పండగే పండుగ అని చెప్పాలి.  ఈ హీరోల నుంచి ప్రేక్షకులు ఏమి ఆశించారో.. అవన్నీ ఈ సినిమాలో పుష్కలంగా ఉన్నాయి.  కొత్తగా ప్రయోగాల జోలికి వెళ్లకుండా.. ఎంటర్టైనర్ వైపు ఎక్కువ దృష్టి సారించి సినిమాను తెరకెక్కించారు.  మనుషులను వేటాడే డాన్ కు.. మంచితనం, అమాయకుడైన డాక్టర్ కు మధ్య స్నేహం కుదిరితే ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెరపై చక్కగా చూపించారు.  ఇద్దరి మధ్య ఉన్న స్నేహాన్ని చాలా సరదగా చూపించి ఆకట్టుకున్నాడు దర్శకుడు.  కమర్షియల్ సినిమాల లాగే.. సినిమాను ఇంటెన్సివ్ గా చూపించారు.  నాగార్జున డాన్ కావడంతో ఆయన ఎప్పుడు కనిపిస్తాడు.. ఎలా కనిపిస్తాడు అనే ఆసక్తిని కలిగేలా చేయడంలో దర్శకుడు సఫలం అయ్యాడు.  దాస్ గా నానిని మలిచిన తీరు బాగుంది.  నాగార్జున, నానీలు కలిసినపుడు వచ్చిన కామెడీ సీన్స్ సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయింది.  ఫస్ట్ హాఫ్ ఎక్కడా బోర్ కొట్టకుండా నడిపించారు.  సెకండ్ హాఫ్ లో అదే విధంగా ఎంటర్టైన్ చేసేందుకు దర్శకుడు ప్రయత్నం చేశాడు.  కొన్ని చోట్ల కథను సీరియస్ గా నడిపించినా.. ఆ వెంటనే ఎంటర్టైన్ చేసేందుకు దర్శకుడు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం విశేషం.  క్లైమాక్స్ కూడా అదే తరహాలో ఉండటంతో సినిమా సంతోషంగా ముగిసింది.  

పనితీరు : 

మొదటి నుంచి చెప్తున్నట్టుగానే నాగ్, నానిలు ఈ సినిమాకు ప్రాణం పోశారు. వారి పాత్రలకు పూర్తిగా న్యాయం చేశారు.  నాగార్జున ఈ సినిమాలో చాల యంగ్ గా, ఎనర్జిటిక్ గా కనిపించి ఔరా అనిపించారు.  రష్మిక, ఆకాంక్షల పాత్రల నిడివి కొద్దిసేపే అయినప్పటికీ గ్లామర్ తో ఆకట్టుకున్నారు. మిగతా పాత్రల్లో నటులు వారి పరిధి మేరకు మెప్పించారు.  

సాంకేతిక వర్గం పనితీరు : 

కథ పాతదే తీసుకున్నా.. కథనాలను నడిపిన తీరు ఆకట్టుకుంది.  ఎంటర్టైనర్ పైనే ఎక్కువ దృష్టి సారించాడు.  షమదత్ సైనుద్దీన్  ఫొటోగ్రఫీ బాగుంది. ముఖ్యంగా పాటల చిత్రికరణ అద్భుతం.  మణిశర్మ మరోసారి మెప్పించాడు.  వైజయంతి మూవీస్ నిర్మాణంలో భారీతనం కనిపించింది.  

పాజిటివ్ పాయింట్స్ : 

నాగ్, నాని 

కథనాలు 

కామెడీ 

పాటలు 

నెగెటివ్ పాయింట్స్ : 

కథ 

చివరగా : దేవదాస్ లు బాగా నవ్వించారు..