నైజాంలో పనిచేసిన నాగార్జున హవా !

నైజాంలో పనిచేసిన నాగార్జున హవా !

సీనియర్ స్టార్ హీరో అక్కినేని నాగార్జున యువ హీరో నానితో కలిసి చేస్తున్న చిత్రం 'దేవదాస్'.  శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి.  ఇటీవల విడుదలైన టీజర్ బాగుండటంతో సినిమా ఎంటెర్టైనింగా ఉంటుందని భావిస్తున్నారంతా.  

దీంతో డిస్ట్రిబ్యూషన్ వర్గాల్లో సినిమాకు డిమాండ్ పెరిగింది.  పైగా నాగార్జున చేస్తున్న కమర్షియల్ సినిమా కావడంతో నైజాం హక్కులను 11 కోట్లుకు పైనే ఏషియన్ సినిమాస్ కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.  సెప్టెంబర్ 27న విడుదలుకానున్న ఈ సినిమాను వైజయంతి మూవీస్ నిర్మిస్తోంది.