దేవదాస్ స్మాల్ పెగ్ టీజర్ రెడీ

 దేవదాస్ స్మాల్ పెగ్ టీజర్ రెడీ

ఆనాటి దేవదాస్ ప్రేమ విఫలం మందు పుచ్చుకుంటే.. ఈనాటి దేవదాసుల ఎందుకు మందు పుచ్చుకుంటున్నారో తెలియాలంటే.. దేవదాస్ సినిమా చూడాలిసిందే.  నాగ్, నానిలు మల్టీస్టారర్ గా వస్తున్న ఈ సినిమాకు శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహించారు.  ఆకాంక్ష సింగ్, రష్మికలు హీరోయిన్లు.  

ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది.  ఒకచేత్తో గన్ను మరో చేత్తో మందు బాటిల్ పట్టుకున్న నాగ్, పక్కన స్కెతస్కోప్ పట్టుకొని నాని పడుకొని ఉంటారు.  ఈ పోస్టర్ అప్పట్లో వైరల్ అయింది.  వైజయంతి మూవీస్ సంస్థ నుంచి వస్తున్న ఈ సినిమా టీజర్ రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల కాబోతున్నది.  స్మాల్ పెగ్ పేరుతో రిలీజ్ చేసిన పోస్టర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నది.