దేవదాస్ బిజినెస్ మామూలుగా లేదు..!!
నాగార్జున.. నానిలు హీరోలుగా వస్తున్న మల్టీ స్టారర్ సినిమా దేవదాస్. ఈనెల 27 వ తేదీన విడుదల కాబోతున్నది. సినిమాకు పాజిటివ్ బజ్ క్రియేట్ కావడంతో ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టుగా తెలుస్తున్నది. ఆంధ్రా ప్రాంతంలో వైజయంతి మూవీస్ సొంతంగా రిలీజ్ చేస్తున్నది. ఆంధ్రా తప్పించి మిగతా ప్రాంతాల్లో బిజినెస్ పూర్తయినట్టు సమాచారం.
నైజాంలో రూ.11 కోట్లు, సీడెడ్ లో రూ. 5 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.2.70 కోట్లు, ఓవర్సీస్ లో రూ.4.50 కోట్ల బిజినెస్ జరిగింది. శాటిలైట్ రైట్స్ రూపంలో ఎంత వరకు బిజినెస్ జరిగింది అనే విషయం తెలియాలి. అన్ని ఏరియాలతో కలుపుకొని మొత్తం మీద రూ.37.50 కోట్ల బిజినెస్ చేసినట్టుగా సమాచారం అందుతున్నది.
నాగార్జున, నానీలకు జోడీలుగా ఆకాంక్ష సింగ్, రష్మిక మందనలు నటిస్తున్నారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకుడు. మణిశర్మ సంగీతం అందించారు.
ఫేస్ బూక్ వ్యాఖ్యలు (0)