ప్రధాని పదవిపై దౌవెగౌడ ఏమన్నారంటే..

ప్రధాని పదవిపై దౌవెగౌడ ఏమన్నారంటే..

ప్రధాని పదవిని ఎవరు అధిరోహిస్తారో తెలియదని.. కానీ తాము మాత్రం కాంగ్రెస్‌ పార్టీతోనే ఉంటామని మాజీ ప్రధాని దేవెగౌడ అన్నారు. కొద్దిసేపటి క్రితం ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పుట్టినరోజు సందర్భంగా నిన్న రాత్రి తిరుమలకు చేరుకున్న ఆయన ఇవాళ ఉదయం స్వామి దర్శనం చేసుకున్నారు. కుమారుడు, కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామితోతో కలిసి ఆయన తిరుమల వచ్చారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు దేవెగౌడ. 35 సంవత్సరాలుగా పుట్టిన రోజు నాడు శ్రీవారిని దర్శించుకుంటున్నానని చెప్పారు.