మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా - గవర్నర్ పాలనా దిశగా అడుగులు 

మహారాష్ట్ర ముఖ్యమంత్రి రాజీనామా - గవర్నర్ పాలనా దిశగా అడుగులు 

మహారాష్ట్రలో గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన కొనసాగుతున్నది.  అక్టోబర్ 21 వ తేదీన ఎన్నికలు జరగగా, అక్టోబర్ 24 వ తేదీన ఫలితాలు వెలువడ్డాయి. ఏ పార్టీకి సరైన మెజారిటీ ఇవ్వలేదు.  బీజేపీకి 105, శివసేన 53, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 స్థానాల్లో విజయం సాధించాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ.. శివసేన పార్టీలు కలిసి పోటీ చేశాయి.  2014 ఎన్నికల్లో రెండు పార్టీలు విడివిడిగా పోటీ చేదుగా బీజేపీ 122 స్థానాల్లో విజయం సాధిస్తే.. శివసేన 63 స్థానాల్లో విజయం సాధించింది. 

కానీ, ఈసారి రెండు పార్టీలు కలిసి పోటీ చేశాయి.  రెండు కలిసి పోటీ చేయడం వలన రెండు పార్టీలకు సీట్లు తగ్గాయి.  బీజేపీ తనకు మొతం 121 మంది మద్దతు ఉందని, కానీ, ప్రభుత్వం ఏర్పాటు చేయాలి అంటే ఇంకా కొంతమంది సపోర్ట్ అవసరం అవుతుంది.  ఈ సమయంలో అంతమంది సపోర్ట్ కోసం ప్రయత్నం చేయడం కంటే రాజీనామా చేయడం ఉత్తమం అని చెప్పి ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ రాజీనామా చేశాడు.  దీంతో ఇప్పుడు మహారాష్ట్రలో గవర్నర్ పాలన దిశగా అడుగులు వేస్తోంది.