అందరి చూపులు ఈ హీరోయిన్ వైపే..!!

అందరి చూపులు ఈ హీరోయిన్ వైపే..!!

తెలుగు సినిమాల్లో నటించేందుకు మలయాళం హీరోయిన్లు ఎక్కువగా ఆసక్తి చూపుతుంటారు.  అక్కడి నుంచే ఇప్పుడు ఎక్కువ హీరోయిన్లు వస్తున్నారు.  అలా వచ్చి టాలీవుడ్ లో చాలా మంది సెటిల్ అయ్యారు.  ఇప్పుడు మరో హీరోయిన్ కూడా ఈ కోవలో చేరిపోయింది.  

సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా రీసెంట్ గా ఓ సినిమా లాంచ్ అయ్యింది.  సుకుమార్ కు చెందిన సుకుమార్ రైటర్స్, మైత్రి మూవీ మేకర్స్ సంస్థలు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.  సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఈ చిత్రానికి దర్శకుడు.  పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో హీరోయిన్ కోసం చాలా రోజులు గాలించారు.  ఎట్టకేలకు మలయాళం హీరోయిన్ ను సెట్ చేశారు.  మలయాళంలో నాన్ ప్రకాశన్ సినిమాలో నటించిన దేవిక సంజయ్ ను హీరోయిన్ గా తీసుకున్నారు.  నాన్ ప్రకాశన్ లో దేవిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.  అందుకే ఆమెను సెలక్ట్ చేసినట్టు సమాచారం.