టీడీపీని ఓడించాలంటూ 'దేవినేని' ప్రచారం..

టీడీపీని ఓడించాలంటూ 'దేవినేని' ప్రచారం..

వైసీపీలో చేరిన మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్‌ ఇవాళ ఆ పార్టీ తరఫున ప్రచారం ప్రారంభించారు. తన సోదరుడు ఉమను ఓడించాలని ఓటర్లను కోరారు. ఇవాళ గొల్లపూడిలో వైసీపీ అభ్యర్థి వసంతకృష్ణప్రసాద్‌ తరఫున ప్రచారం చేసిన చంద్రశేఖర్‌.. వైసీపీకి పట్టం కట్టాలని విజ్ఞప్తి చేశారు. మైలవరం నియోజకవర్గంలో వసంతకృష్ణప్రసాద్‌పై దేవినేని ఉమ పోటీ చేస్తున్న విషయం తెలిసిందే..