అనేక రకాల కారణాల వల్ల పార్టీ మారాను: దేవినేని

అనేక రకాల కారణాల వల్ల పార్టీ మారాను: దేవినేని

అనేక రకాల కారణాల వల్ల పార్టీ మారాను అని ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర్ రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ తెలిపారు. సోమవారం దేవినేని ఉమామహేశ్వర్ రావు సోదరుడు దేవినేని చంద్రశేఖర్ వైసీపీలో చేరారు. మైలవరం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్, దేవినేని చంద్రశేఖర్ లు హైద్రాబాదులోని లోటస్ పాండ్ కు వచ్చి వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను కలిశారు. జగన్ పార్టీ కండువా కప్పి చంద్రశేఖర్‌ను వైఎస్సార్‌సీపీలోకి ఆహ్వనించారు. ఈ సందర్భంగా వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ... రామణుడు లంక నుండి విభీష్ముడు బయటకు వచ్చినట్లు.. దేవినేని ఉమ నుండి దేవినేని చంద్రశేఖర్ బయటకు వచ్చారన్నారు. దేవినేని చంద్రశేఖర్, నేను ఎన్నికలో కలిసి పనిచేస్తామన్నారు. మంత్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని మమ్మలి అణగదొక్కలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకా మంత్రి ఆగడాలు సాగవని కృష్ణ ప్రసాద్ అన్నారు.

దేవినేని చంద్రశేఖర్ మాట్లాడుతూ... అనేక రకాల కారణాల వల్ల పార్టీ మారాను. అధికార పార్టీ దోపిడీ ఎక్కువగా ఉంది. పోలవరంతో పాటు ఇరిగేషన్ ప్రాజెక్టులలో దోపిడీ అధికంగా ఉంది. కేసుల నుండి మంత్రి బయటపడలేరన్నారు.