ఆ విషయం మోడీకి తెలియదా?: ఉమ

ఆ విషయం మోడీకి తెలియదా?: ఉమ

పోలవరం పై ప్రధాని మోడీ ఆరోపణలు దారుణమని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ భూ సేకరణకు రూ.33 వేల కోట్లు ఖర్చు అవుతుందని ప్రధానికి తెలియాదా అని ప్రశ్నించారు. అవకతవకలు ఉంటే సాంకేతిక సలహా మండలి ఎలా ఆమోదం తెలిపిందన్న ఆయన.. మోడీ ఆరోపించినట్టు పోలవరం ప్రాజెక్టు ఏటీఎం కాదని.. నర్మదా ప్రాజెక్టు ఏటీఎం అని అన్నారు. పోలవరంపై ప్రధాని వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఇప్పటికీ రూ.4300 కోట్లు కేంద్రం నుంచి రావాల్సి ఉందని.. ఆ విషయంపై మోడీ సమాధానం చెప్పాలన్నారు. జాతీయ సంస్థలు పోలవరంపై ప్రసంశలు కురిపిస్తున్నాయని ఈ సందర్భంగా ఉమ గుర్తు చేశారు.