వేడెక్కుతున్న ఏపీ రాజకీయం - దేవినేని కౌంటర్ ఎటాక్..!!

వేడెక్కుతున్న ఏపీ రాజకీయం - దేవినేని కౌంటర్ ఎటాక్..!!

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు రోజు రోజుకు వేడెక్కుతున్నాయి.  నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ మంత్రులు తెలుగుదేశం పార్టీపై విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.  అయితే, ఆ విమర్శల్లో వాడిన పదజాలం ఘాటు ఎక్కువైనా సంగతి తెలిసిందే.  ఆ మాటలు ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీకి గట్టిగా గుచ్చుకున్నాయి. ఈ రోజు ఉదయం ప్రతిపక్ష సభ్యులు, తెలుగుదేశం పార్టీనేత దేవినేని ఉమా మంత్రుల మాట్లాడిన మాటలకూ కౌంటర్ ఇచ్చారు.  

సన్నబియ్యం ఇస్తామని ఏపీ మంత్రి నాని ఎన్నోసార్లు చెప్పారని, ముఖ్యమంత్రి, మంత్రులు సన్నబియ్యంపై అనేక ప్రకటనలు చేసారని, ఇప్పుడు ఆ బియ్యం గురించి అడిగితె.. తెలుగుదేశం పార్టీ నేతలు వెకిలి చేష్టలు చేస్తున్నారని విమర్శించడం న్యాయం కాదని అన్నారు.  సీఎం జగన్ కు అభద్రతా భావం ఎక్కువగా ఉందని, ఎందుకో అర్ధం కావడం లేడనై ఉమా పేర్కొన్నారు.  మంత్రులు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని, పేదవాడికి సన్నబియ్యం ఇవ్వాలని అడిగితే.. ఒళ్ళు దగ్గరపెట్టుకొని మాట్లాడమని మంత్రులు చెప్తుండటం దేనికి సంకేతమో చెప్పాలని దేవినేని డిమాండ్ చేశారు.