'నా ప్రత్యర్థికి కేసీఆర్ రూ.100 కోట్లు పంపారు..!'

'నా ప్రత్యర్థికి కేసీఆర్ రూ.100 కోట్లు పంపారు..!'

తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు ఏపీ మంత్రి, మైలవరం టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు... మైలవరంలో వైసీపీ అభ్యర్థికి కేసీఆర్ రూ.100 కోట్లు పంపించారని ఆరోపించారు. సోమవారం ఏపీలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై స్పందించిన దేవినేని ఉమా... పోలవరంపై కేసీఆర్, టీఆర్ఎస్ నేతలు కేసులు వేసింది వాస్తవం కాదా? అని ప్రశ్నించారు. అఫిడవిట్ల పై టీఆర్ఎస్ నేతలు ఏం చెబుతారని నిలదీశారు. పోలవరం ప్రాజెక్టుకు అడ్డం కాకపోతే కేసీఆర్ వేసిన కేసులపై వైఎస్ జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు దేవినేని. ఇక ఏపీ ప్రత్యేక హోదాకు మద్దతు ఇస్తామన్న కేసీఆర్ మాటను ఒక్కరైనా నమ్ముతారా..!? అంటూ ఎద్దేవా చేశారు. దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న కేసీఆర్ ప్రకటన ఏమైందో తెలుసుకదా! అంటూ సెటైర్లు వేశారు.