'జగన్‌ నిజం ఒప్పుకున్నారు..'

'జగన్‌ నిజం ఒప్పుకున్నారు..'

సీఎం కుర్చీ కోసం ఎన్ని ఆరాచకాలైనా చేయగల సమర్థుడు వైసీపీ అధినేత జగన్‌ అని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అధికారమే పరమావధిగా జగన్ వ్యక్తిగత దూషణలు చేస్తున్నారని విమర్శించారు. ఇవాళ అమరావతిలో ఆయన మాట్లాడుతూ ఫామ్-7 తానే దరఖాస్తు చేయించానని జగన్‌ ఒప్పుకున్నారని అన్నారు. జగన్‌ స్వయంగా ఒప్పుకున్నందున ఈసీ తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణలో 24లక్షల ఓట్లు తొలగించి కేసీఆర్ అధికారంలోకి వచ్చారని.. ఏపీలోనూ 54 లక్షల ఓట్లు తొలగించి అధికారంలోకి రావాలని జగన్ కుట్ర పన్నారని ఉమ ఆరోపించారు.