దేవిశ్రీ ఖాతాలో అరుదైన రికార్డ్

దేవిశ్రీ ఖాతాలో అరుదైన రికార్డ్

సౌత్ స్టార్ మ్యూజిక్ దర్శకుల్లో దేవిశ్రీ ప్రసాద్ ఒకరు.  దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడు అంటే సాంగ్స్ మ్యూజికల్ గా హిట్ కొట్టినట్టే.  ప్రస్తుతం దేవిశ్రీ మహేష్ 25 వ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.  దేవి పని అయిపొయింది అనుకుంటున్న తరుణంలో మంచి హిట్ ఇస్తూ దూసుకుపోతున్నాడు.  మహర్షిలో సాంగ్స్ పెద్దగా లేవు అనుకున్న వాళ్లకు మహర్షి థీమ్ సాంగ్ తో సమాధానం చెప్పాడు.  

మహర్షికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ తన ఖాతాలో అరుదైన రికార్డును వేసుకున్నాడు.  అదేమంటే.. సౌత్ స్టార్ హీరోల ల్యాండ్ మార్క్ గా చెప్పుకునే సినిమాలకు దేవిశ్రీ సంగీతం అందించాడు.  ఎన్టీఆర్ 25 వ సినిమా నాన్నకు ప్రేమతో, కోలీవుడ్ స్టార్ హీరో సూర్య 25 వ సినిమా సింగం అలానే మెగాస్టార్ 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.  ఇప్పుడు మహేష్ 25 వ సినిమా మహర్షికి కూడా దేవిశ్రీ సంగీతం అందించి అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు.