దేవిశ్రీ మాట నిలుపుకుంటాడా..?

దేవిశ్రీ మాట నిలుపుకుంటాడా..?

దేవిశ్రీ ప్రసాద్... టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్.  తన నుంచి ఎన్నో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్స్ వచ్చాయి.  చాలా సినిమాలు మ్యూజికల్ హిట్ అయ్యాయి.  గత కొంతకాలంగా దేవిశ్రీ నుంచి ఆ రేంజులో ఉండే ఆల్బమ్ రావడం లేదు.  ఇచ్చిన సినిమాలు సో సో గా ఉంటున్నాయి.  దీంతో దేవిశ్రీ మ్యూజిక్ అంటే ప్రేక్షకులు భయపడుతున్నారు.  

ఆల్బమ్ హిట్టయితే సినిమా హిట్టైనట్టే అనే నానుడి ఉంది.  దేవిశ్రీ సంగీతం అందించిన సినిమాలు వరసగా ఫెయిల్ అవుతుండటంతో అభిమానులు ఇబ్బందుల్లో పడుతున్నారు.  మహర్షి సినిమాకు అందించిన ఆల్బమ్ లో సాంగ్స్ ఏవో కొన్ని ఫర్వాలేదు అనిపించినైనా చెప్పుకోవడానికి పెద్దగా లేకపోవడంతో మహేష్ అభిమానులు ఆగ్రహంతో ఉన్నారు.  ఇదిలా ఉంటె, మహేష్ 26 వ సినిమాకు కూడా దేవిశ్రీని తీసుకున్నారు.  

దేవిశ్రీ మహేష్ ఫ్యాన్స్ కు హామీ ఇచ్చారు.  ప్రతి ఒక్కరు గుర్తుంచుకునే విధంగా ఓ మంచి ఆల్బమ్ ఇస్తానని ప్రామిస్ చేశాడు.  మరి అనుకున్నట్టుగానే దేవిశ్రీ ఆల్బమ్ అందిస్తాడా చూద్దాం.