రాజన్నకు 'కుక్క' మొక్కు

రాజన్నకు 'కుక్క' మొక్కు

తన కుక్కను కాపాడిన వేములవాడ రాజన్నకు నిలువెత్తు (కుక్క) బంగారంను సమర్పించుకుంది ఓ భక్తురాలు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి గ్రామానికి చెందిన రాజు, లత అనే దంపతులకు పిల్లలు లేకపోవడంతో రెండు కుక్క లను పెంచుకుంటున్నారు. అందులో ఒక కుక్క పిల్లకు ఆరోగ్యం బాగా లేకపోయేసరికి వేములవాడ రాజన్నకు మొక్కింది. కుక్క ఆరోగ్యం కుదుటపడతే నీ పేరు పెట్టి.. తన, కుక్క ఎత్తు బంగారం ఇస్తా అని మొక్కుకుంది. కుక్క ఆరోగ్యం కుదుటపడడంతో.. దంపతులు శివ అని పేరు పెట్టి, రాజన్నకు బెల్లం మొక్కును సమర్పించుకున్నారు.