'డ్రోన్' వివాదంపై డీజీపీ క్లారిటీ

'డ్రోన్' వివాదంపై డీజీపీ క్లారిటీ

ఉండవల్లిలోని టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న లింగమనేని గెస్ట్‌హౌస్‌పై డ్రోన్ ఎగరడం వివాదమైంది.. ఈ వ్యవహారంపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్ధమే నడిచింది. దీనిపై డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసికూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ వ్యవహారంపై ఇవాళ క్లారిటీ ఇచ్చారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్. కృష్ణా నదిలో వరదల కారణంగా అంచనా కోసం ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ డ్రోన్ ఉపయోగించిందని ఆయన స్పష్టం చేశారు. అయితే, దీనిపై స్థానిక పోలీసులకు సమాచారం లేనందున కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చిందన్నారు. చంద్రబాబు నివాసంపై డ్రోన్ ఎగరడంపై ఎలాంటి కుట్రలేదని.. దీనిని రాజకీయం చేయొద్దని కోరారు డీజీపీ. ఇకపై ఎవరైనా డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు డీజీపీ గౌతమ్ సవాంగ్.