'విశాఖలో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌'

'విశాఖలో కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ టీమ్‌'

తిరుమల, షార్‌ సెంటరే కాకుండా విశాఖపట్నం కూడా ముఖ్యకేంద్రంగా మారిందని ఏపీ డీజీపీ ఠాకూర్‌ అన్నారు. అందుకే కౌంటర్ ఇంటెలిజెన్స్ టీమ్‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇవాళ విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ విశాఖకు వలస వచ్చే వారి సంఖ్య పెరుగుతోందని.. ఆ క్రమంలో క్రైమ్ రేట్ కూడా పెరుగుతోందన్నారు. సైబర్‌ నేరాలు కూడా ఎక్కువయ్యాయన్నారు. అందుకే విశాఖపై ప్రత్యేక దృష్టిసారించామన్నారు. నగరంలో ప్రతి కార్నర్‌లో సీసీ టీవీలు ఏర్పాటు చేస్తున్నానమని ఆయన చెప్పారు. శ్రీలంక పేలుళ్ల ఘటనలో సీసీ టీవీలే కీలకంగా మారాయని ఆయన గుర్తుచేశారు.