పోలింగ్ సజావుగా ముగిసింది: తెలంగాణ డీజీపీ

పోలింగ్ సజావుగా ముగిసింది: తెలంగాణ డీజీపీ

రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకున్నారని పేర్కొన్నారు. ప్రశాంతతకు భంగం కలుగకుండా సహకరించిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. అన్ని ప్రభుత్వ విభాగాల సమన్వయంతో పోలింగ్ సజావుగా ముగిసిందన్నారు. భవిష్యత్ లోనూ ప్రజలు సహకరించాలని తెలిపారు. చెదురుముదురు ఘటనలు మినహా ఎక్కడా హింస చోటుచేసుకోలేదని డీజీపీ ప్రకటించారు. సమస్యాత్మక ప్రాంతాల్లోనూ పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందన్నారు. స్ట్రాంగ్ రూమ్ ల వద్ద మూడంచల భద్రత కల్పిస్తామని అన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు కేంద్ర పోలీస్ బలగాలతో పహారా కాస్తున్నట్లు డీజీపీ తెలిపారు.