గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

గణేష్‌ నిమజ్జన ఏర్పాట్లపై డీజీపీ సమీక్ష

గణేశ్ నిమజ్జనోత్సవం, మొహర్రం బందోబస్తు ఏర్పాట్లపై తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత నాలుగు సార్లు గణేష్ వేడుకలను ప్రశాంతంగా జరుపుకున్నామని, అదే స్పూర్తితో ఈ సారి కూడా వేడుకలను ప్రశాంతంగా నిర్వహించాలన్నారు. మండపాల నిర్వాహకులు, ప్రజలతో స్నేహపూర్వకంగా కడుచుకోవాలని, శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా చూడాలని అన్నారు. త్వరగా నిమజ్జనానికి తరలించాలనే తొందరలో మండపాల నిర్వాహకులపై ఒత్తిడి తేవోద్దని ఆయన సూచించారు. మండపాల నిర్వాహకులతో స్నేహపూర్వక వాతావరణంలో నిమజ్జన రూట్ మ్యాప్ పై చర్చించుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు.