పక్కా మాస్ స్టైల్ లో....

పక్కా మాస్ స్టైల్ లో....

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా చేస్తున్న సినిమా అసురన్.  వెట్రిమారన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.  ధనుష్ తో వెట్రిమారన్ రీసెంట్ గా వడ చెన్నై సినిమా చేశారు.  ఈ సినిమా మంచి విజయం సాధించడంతో అదే దర్శకుడితో అసురన్ ప్లాన్ చేశారు ధనుష్. 

ఇదిలా ఉంటె, ఈ సినిమాను తమిళ్ స్టయిల్ లో పక్కా మాస్ కు నచ్చే విధంగా తీర్చిదిద్దుతున్నారు.  ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతున్నది.  దీనికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రిలీజ్ చేశాడు.  గడ్డం పెంచి చేతిలో కత్తిపట్టుకొని ఉన్న ధనుష్ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.