వీఅర్వోలను బజార్లో పడేయ్యలేదు

వీఅర్వోలను బజార్లో పడేయ్యలేదు

రెవెన్యూ వ్యవస్థలో అవకతవకలు, అవినీతిని నిర్మూలించి పారదర్శకత కోసం తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. నేటి నుంచి తెలంగాణలో రిజిస్ట్రేషన్ల విధానం మారనుంది. ఈ క్రమంలో ఇటీవల వీఆర్వో, వీఆర్ఏ వ్యవస్థను రద్దు చేయడం తెలిసిందే. నేడు ధరణి పోర్టల్ ప్రారంభించిన అనంతరం తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు. అతి త్వరలోనే వీఆర్వోల సమస్యను పరిష్కరిస్తామని.. వివిధ శాఖల్లో ఉన్న ఖాళీల్లో వీఆర్వోలను సర్దుబాటు చేస్తామన్నారు. వీఆర్వోలు ఎవరు కూడా బాధపడాల్సిన అవసరం లేదని.. బజార్లో పడేస్తామని ఎక్కడ కూడా చెప్పలేదని సీఎం కేసీఆర్ తెలిపారు.