ధర్మాడి సత్యానికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన సర్కార్

ధర్మాడి సత్యానికి ప్రతిష్టాత్మక అవార్డు ప్రకటించిన సర్కార్

వైయస్సార్ లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డును ప్రకటించింది. గోదావరిలో కచ్చులూరు వద్ద మునిగిన బోటును వెలికి తీసిన ధర్మాడి సత్యంపై సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. గోదావరిలో మునిగిన బోటును బయటికి తీస్తానంటే సర్కారు ధర్మాడి సత్యానికి బాధ్యత అప్పగించింది. వందల అడుగున లోతున ఉన్న బోటును నిపుణులు కూడా వెలికితీయటానికి సాహసం చేయలేకపోయారు. అయినప్పటికీ ధర్మాడి సత్యం ధైర్యం చేసి బోటును బయటికి తీసేందుకు పెద్ద సాహమే చేశాడు. వైఎస్సార్ లైఫ్ టైం అచీవ్ మెంట్ అవార్డు ధర్మాడి సత్యానికి ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ నిర్ణయించారని ఏపీ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. కచ్చులూరు పడవ ప్రమాదాన్ని విపక్షాలు రాజకీయం చేశాయని మండిపడ్డారు మంత్రి కన్నబాబు. వైయస్సార్ లైఫ్ టైమ్ అవార్డులు ఇవ్వాలని ఏపీ కేబినెట్ నిర్ణయించిన తర్వాత తొలి అవార్డు ధర్మాడి సత్యానికే దక్కింది.