'వివేకాకి సాధారణ శత్రువులే ఉండరు'

'వివేకాకి సాధారణ శత్రువులే ఉండరు'

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి వంటి వారికి సాధారణంగా శత్రువులే ఉండరు. ఒక్కడే ఇంట్లో నివసిస్తున్నాడు అంటే తనకి శత్రువులు లేరని తనకి కూడా తెలుసని వైసీపీ సీనియర్ నేత ధర్మాన ప్రసాద రావ్ అన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఎన్నికల ముందు ప్రధాన ప్రతిపక్ష నేత కుటుంబానికి చెందిన ప్రధాన నాయకుడిని హత్య చేశారు. వివేకానంద రెడ్డి గురించి ఈ రాష్ట్రానికి పరిచయం చేయాల్సిన అవసరం లేదన్నారు. ఎంపీగా ఉన్నా సాధారణ పౌరుడిలా జీవించారు. ముఖ్యమంత్రి సోదరుడిగా, రాజకీయ నాయకుడిగా ప్రవర్తించకుండా సాధారణంగా ఉండేవారు. వైఎస్ వివేకా వంటి వారికి సాధారణంగా శత్రువులే ఉండరు. ఆయనకు వ్యాపారలావాదేవీలు లేవు, గొడవలు లేవు. తనకి ఎవరి మీద ద్వేశం లేదు, తనకి శత్రువు ఉండరని తెలుసు. కానీ అలాంటి నాయకుడిని దారుణంగా హత్య చేశారని ధర్మాన మండిపడ్డారు.

కడప జిల్లాలో రానున్న ఎన్నికల్లో ప్రభావితం చేయగల మనిషి వివేకా. ఇలాంటి సందర్భంలో‌ ఆయనను ఎవరు హత్య చేశారో అందరికి తెలుసని ధర్మాన అన్నారు. ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక చంద్రబాబు పోలీసులు చేయాల్సిన విచారణ ఆయనే చేస్తున్నారు. హత్య తర్వాత పోలీసులు ఏం చేయాలో, పోలీసుల విచారణ తీర్పు ఎలా వస్తుందో కూడా ఆయనే చెప్తున్నారన్నారు. సిట్ లు ఏర్పాటు చేస్తూ.. డిపార్ట్ మెంట్ ను భ్రష్టు పట్టిస్తున్నారు, ప్రభుత్వ వ్యవస్థల మీద నమ్మకం లేకుండా చేశాడు చంద్రబాబు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు.. ముఖ్యమంత్రిని ఫినిష్ చేస్తాం అనే మాటలు మాట్లాడుతాడు. రాజకీయంగా ఫినిష్ చేస్తాడు అనుకుంటాం కానీ.. మనుషులనే మాయం చేస్తాడనుకులేదన్నారు. ఆ కుటుంబాన్ని మొత్తం ఫినిష్ చేయాలని ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో వైసీపీ ఎక్కడ బలమైన నాయకులు ఉన్నా హత్య చేస్తున్నారు. నిష్పక్షపాత దర్యాప్తు జరిపేలా సీబీఐ విచారణ వేయొచ్చు కదా. చంద్రబాబు పరువు పోకముందే సీబిఐ దర్యాప్తు చేయించండని ధర్మాన కోరారు.