ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష.. LIVE

ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష.. LIVE

కేంద్రంపై ఏపీ ప్రభుత్వం చేస్తున్న 'ధర్మ పోరాటం' ఇప్పుడు ఢిల్లీ చేరుకుంది. ప్రత్యేక హోదాతోపాటు విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ దేశ రాజధానిలో ఇవాళ ధర్మ పోరాట దీక్ష చేపడుతున్నారు. ఏపీ భవన్‌ వేదికగా దీక్షకు దిగనున్న సీఎం చంద్రబాబునాయుడు.. రాత్రి 8 గంటల వరకు కొనసాగిస్తారు. ఈ దీక్షలో రాష్ట్రానికి చెందిన 26 మంది మంత్రులు, 104 మంది ఎమ్మెల్యేలు, 43 మంది ఎమ్మెల్సీలు, 20 మంది పార్టీ ఎంపీలు, మరో 15 మంది కార్పొరేషన్ల చైర్మన్లు, 150 మంది పార్టీ ముఖ్య నేతలు, 150 మంది పార్టీ కార్యవర్గ సభ్యులు పాల్గొంటున్నారు. ఈ దీక్ష ప్రత్యక్ష ప్రసారాన్ని కింద వీడియోలో వీక్షించండి..