'మోడీపై రైతుల పోటీ.. కవితే కారణం..!'

'మోడీపై రైతుల పోటీ.. కవితే కారణం..!'

ప్రధాని నరేంద్ర మోడీపై వారణాసి లోక్‌సభ స్థానం నుంచి నిజమాబాద్‌ పసుపు రైతులు పోటీకి సిద్ధమవుతుండడంపై బీజేపీ నేత ధర్మపురి అరవింద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎంపీ కల్వకుంట్ల కవిత ప్రోత్సాహంతో రైతులు పోటీకి దిగుతున్నారని అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మట్లాడుతూ రైతులు పోటీకి దిగడం రాజకీయ ప్రేరేపితమేన్నారు.  

'మొన్న నిజామాబాద్‌లో నామినేషన్లు వేసిన రైతుల్లో ఒక్కరు కూడా ఇప్పుడు వారణాసిలో నామినేషన్ వేస్తామన్న వారిలో లేరు. వారంతా టీఆర్‌ఎస్‌ కరుడు గట్టిన నేతలే' అని అన్నారు అరవింద్‌. 'పోటీ చేస్తామని చెప్పిన వారిలో సగం మంది రైతులే కాదు. వారు పసుపు పండంచరు. సమ్మర్ ప్యాకేజీలో భాగంగానే నామినేషన్లు వేస్తున్నారు' అని అభిప్రాయపడ్డారు. వీరందరికీ వారిణాసికి టికెట్లు ఎవరు సమకూరుస్తున్నారని ప్రశ్నించారు.

కవితకు పసుపు రైతుల మీద ప్రేమ ఉంటే బోనస్ ఎందుకు ఇప్పించలేదని ప్రశ్నించిన ఆయన.. పసుపు బోర్డు కోసం కవిత చేసిందేమీ లేదన్నారు.   పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని తమ పార్టీ మేనిఫెస్టో కమిటీ ఛైర్మన్‌ రాజనాథ్‌సింగ్‌ హామీ ఇచ్చారని అరవింద్‌ తెలిపారు. బీజేపీ జాతీయ నేతలు ఇచ్చిన హామీని జీర్ణించుకోలేక ఈ చిల్లర రాజకీయాలకు కవిత పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.