ప్రమాద స్థాయికి గోదావరి ప్రవాహం...

ప్రమాద స్థాయికి గోదావరి ప్రవాహం...

గోదావరిలో వరద ప్రవాహం ప్రమాదకరస్థాయికి చేరుతోంది... తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరువలో గోదావరి వరద ప్రవాహం ఉంది. దీంతో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి 8 లక్షల 90 వేల క్యూసెక్కుల వరద నీటి విడుదల చేస్తున్నారు అధికారులు. ప్రస్తుత నీటిమట్టం 10.9 అడుగులుగా ఉండగా... 11.75 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. మరోవైపు వరద ప్రభావంతో కోనసీమలో వశిష్ట, వైనతేయ, గౌతమి ఉపనదులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో గోదావరి లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.