ధావన్ అర్ధశతకం

ధావన్ అర్ధశతకం

ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ బౌండరీల మోత మోగిస్తున్నాడు. వరుసగా విగలమవుతున్న ధావన్.. ఈ మ్యాచ్ లో ఆసీస్ పేసర్లను ధీటుగా ఎదుర్కొంటూ అర్ధశతకం చేసాడు. 51 బంతుల్లో 9ఫోర్ల సాయంతో అర్ధశతకం చేసాడు. వన్డే కెరీర్‌లో ధావన్‌కిది 28వ అర్ధశతకం. మరో ఓపెనర్ రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతున్నాడు. ఈ జోడి ఇప్పటికే 100 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రస్తుతం 21 ఓవర్లు ముగిసేసరికి భారత్‌ వికెట్ నష్టపోకుండా 124 పరుగులు చేసింది. ధావన్ (75), రోహిత్ (47) క్రీజులో ఉన్నారు.