చారిత్రక టెస్టు: ధవన్ హాఫ్ సెంచరీ

చారిత్రక టెస్టు: ధవన్ హాఫ్ సెంచరీ

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా భారత్-ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య జరుగుతున్న చారిత్రక ఏకైక టెస్టు మ్యాచ్‌లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ రహానే బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత ఇన్నింగ్స్ ను ఓపెనర్లు శిఖర్ ధావన్, మురళి విజయ్ లు ఘనంగా  ఆరంభించారు. ముఖ్యంగా శిఖర్ ధావన్ పరిమిత ఓవర్ల క్రికెట్ తరహాలో బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ఈ క్రమంలో ఆఫ్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఫోర్ కొట్టిన శిఖర్(51; 47 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్సర్‌) అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. టెస్టు కెరీర్‌లో ధావన్‌కు ఇది ఆరో అర్ధశతకం. మరోవైపు విజయ్ ఆచితూచి ఆడుతూ ధావన్ కు చక్కటి సహకారంను అందిసున్నాడు. 22 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా భారత్ 124 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో  మురళీ విజయ్(29), శిఖర్ ధావన్(82) పరుగులతో ఉన్నారు.