తోటి ఆటగాళ్లను ఆటపట్టించిన 'ధావన్'

తోటి ఆటగాళ్లను ఆటపట్టించిన 'ధావన్'
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ ఎప్పుడూ దూకుడుగా, సరదాగా ఉండటం మనం పలు మ్యాచ్ లలో చూస్తేనే ఉన్నాం. బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేసే క్రమంలో సమయం దొరికినప్పుడల్లా స్టేడియంలోని అభిమానులను తన చిలిపి పనులతో అలరిస్తుంటాడు. ఇదే తరహాలో ఐపీఎల్ సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లును కూడా ఆటపట్టించాడు. విమానంలో అలసిసొలసి పడుకున్న టీమ్ మేట్స్‌తో సరదాగా ఓ ఆటాడుకున్నాడు. బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబుల్ హసన్, ఆఫ్ఘన్ స్టార్ బౌలర్ రషీద్ ఖాన్‌లను ఆటపట్టించాడు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు విమానంలో నిద్రపోతున్న సమయంలో ధావన్ ఓ పేపర్ ముక్కను వాళ్ల ముక్కుల్లో పెట్టడంతో ఒక్కసారిగా వాళ్ళు నిద్రలోంచి లేచి.. ఏం జరిగిందో అర్థం కాకపోయినప్పటికీ నవ్వుకున్నారు. ధావన్ వాళ్లను ఆట పట్టిస్తుంటే మిగతా సన్‌రైజర్స్ జట్టు ఆటగాళ్లు ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అయింది. ఐపీఎల్ -11 సీజన్ లో ఆడిన మూడు మ్యాచ్ లలో గెలిచి మంచి జోరు మీద ఉంది సన్‌రైజర్స్. రాజస్థాన్, ముంబై, కోల్‌కతా టీమ్స్‌పై గెలిచిన సన్‌రైజర్స్ జట్టు పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నది.