నో యాడ్స్ అంటున్న ధోని... 

నో యాడ్స్ అంటున్న ధోని... 

ప్రస్తుతం మన దేశాన్ని కరోనా  వణికిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ వైరస  భారతదేశంలో క్రికెట్ మ్యాచ్ లు నిలిపివేయబడటంతో ఆటగాళ్లు అందరూ  సోషల్ మీడియాకు అంకితం అయ్యారు. కానీ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని లాక్ డౌన్ లో సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్నాడు, అయితే అతని భార్య సాక్షి ధోని మాత్రం తమ రాంచీ ఫామ్ హౌస్ నుండి ఎంఎస్ ధోని యొక్క ఫోటోలు, వీడియోలను పోస్ట్ చేస్తూనే  ఉన్నారు. ఇంతక ముందు పోస్ట్ చేసిన వీడియోలో, ధోని ట్రాక్టర్ నడుపుతూ తన ఫామ్‌హౌస్‌లో పొలంలో దున్నుతున్నట్లు కనిపించారు . అయితే ఈ సమయంలో ధోని ఓ కీలక నిర్ణయం తీసుకుంటారట! అదేంటంటే ఆయన యాడ్స్  చేయకూడదు అని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే అది పూర్తిగా కాదు మన దేశం లో ఈ కరోనా ప్రభావం తగ్గే వరకు మాత్రమే. ధోని ఆదాయం సంవత్సరానికి 100 కోట్లకు పైనే, అందులో సగానికి పైగా యాడ్స్ ద్వారానే వస్తుంది. ఇక 2019 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ ఆడని ఎంఎస్ ధోని, ఐపీఎల్ 2020 తో మార్చిలో తిరిగి క్రికెట్ లోకి రావాల్సి ఉంది. అయితే, కొనసాగుతున్న కరోనావైరస్ సంక్షోభం కారణంగా, బీసీసీఐ ఈ టోర్నీని నిరవధికంగా వాయిదా వేసిన విషయ తెలిసిందే.