రైతుగా మారిన ధోని... ఏం చేస్తున్నాడో చూశారా... 

రైతుగా మారిన ధోని... ఏం చేస్తున్నాడో చూశారా... 

మహేంద్ర బ్యాట్ తో మెరుపులు మెరిపించి ధోని ఇప్పుడు పద్దతి మార్చుకున్నారు.  బ్యాట్ తో మైదానంలో క్రికెట్ ఆడిన వ్యక్తి ఇప్పుడు వ్యవసాయ క్షేత్రంలో రైతుగా వ్యవసాయం చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.  తన పొలంల్లో బొప్పాయి, పుచ్చకాయ పంటలను పండించేందుకు సిద్ధం అవుతున్నాడు.  అయితే అది కూడా పూర్తిగా సేంద్రియ పద్దతిలోనే.  సేంద్రియ పద్దతిలో ఈపంటను పండించబోతున్నట్టు ధోని పేస్ బుక్ ద్వారా తెలిపారు.  

దీనికి సంబంధించిన పేస్ బుక్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.  ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది.  కొబ్బరికాయ కొట్టి విత్తనాలు వేయబోతున్నట్టు తెలిపారు. ధోని చేస్తున్న పనికి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.  మంచి పనులు చేస్తున్నందుకు నెటిజన్లు మెచ్చుకుంటూ మెసేజ్ చేస్తున్నారు.  రాజకీయాల్లోకి వెళ్లకుండా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తున్నారని మెచ్చుకుంటున్నారు.