రిటైర్మెంట్‌పై ధోనీ కీలక నిర్ణయం

రిటైర్మెంట్‌పై ధోనీ కీలక నిర్ణయం

రిటైర్మెంట్‌పై టీమిండియా కీలక ఆటగాడు మహేంద్ర సింగ్‌ ధోనీ క్లారిటీ ఇచ్చేశాడు. ప్రస్తుతానికి రిటైర్మెంట్‌ ఆలోచన లేదని తేల్చి చెప్పాడు. కానీ త్వరలో జరిగే వెస్టిండీస్‌ టూర్‌కు మాత్రం అందుబాటులో ఉండబోనని స్పష్టం చేశాడు. గౌరవ లెఫ్టినెంట్‌ కల్నల్‌ హోదాలో ఉన్న ధోనీ.. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం వచ్చే రెండు నెలలూ తన పారామిలిటరీ రెజిమెంట్‌తో కలిసి పనిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో 2 నెలలపాటు క్రికెట్‌కు దూరం కానున్నాడు. ఈ విషయాన్ని ధోనీ స్వయంగా తమను కలిసి వివరించాడని బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. 

ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నామన్న ఆయన.. ఇదే విషయాన్ని సెలక్షన్‌ కమిటీ ఛైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌, టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీలకు చేరవేశామని చెప్పారు. ధోనీ తప్పుకోవడంతో విండీస్‌ టూర్‌కు ప్రధాన కీపర్‌గా రిషభ్‌ పంత్‌కు అవకాశం దక్కబోతోంది. సీనియర్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను సెకెండ్‌ చాయిస్‌ కీపర్‌గా ఎంపిక చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక.. విండీస్‌ టూర్‌ను భారత జట్టును రేపు ప్రకటించబోతున్నరు సెలెక్టర్లు.