ధోనికి కొత్త కష్టాలు.. !!!

ధోనికి కొత్త కష్టాలు.. !!!

మహేంద్రసింగ్ ధోని క్రికెట్ ఇండియాకు ఎన్నో సేవలు చేశారు.  టెస్ట్ క్రికెట్ నుంచి తప్పుకున్నాక ధోని వన్డే, టి 20 మ్యాచ్ లకు పరిమితం అవుతున్నాడు.  అయితే, వరల్డ్ కప్ తరువాత కరేబియన్ దీవుల్లో జరిగిన మ్యాచ్ లకు దూరంగా ఉన్నాడు.  సైన్యంతో కలిసి పనిచేసేందుకు ధోని ఆ నిర్ణయం తీసుకున్నారు.  ఆ తరువాత ఇండియాలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మ్యాచ్ లకు ధోనిని ఎంపిక చేయకపోవడం చర్చకు వచ్చింది.  ధోనిని పక్కన పెడుతున్నారని అభిమానులు మండిపడుతున్న సంగతి తెలిసిందే.  

ఇప్పుడు ధోనికి సమయం దొరకడంతో.. రాంచీలో తన కుటుంబసభ్యులతో గడుపుతున్నాడు.  అయితే, రాంచిలో ప్రస్తుతం కరెంట్ కోతలు విపరీతంగా ఉన్నాయట.  మిగతా కుటుంబాల మాదిరిగానే ధోని కుటుంబానికి కూడా కరెంట్ కోతలు తప్పలేదు.  కరెంట్ కోత కారణంగా ఇబ్బందులు పడుతున్నట్టు ధోని భార్య సాక్షి సింగ్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది.  సెప్టెంబర్ 19 వ తేదీన 5 గంటలపాటు కరెంట్ లేదని ఉక్కపోతతో ఇబ్బందులు పడినట్టు సాక్షి సింగ్ పేర్కొంది.  అయితే, వాతావరణం చల్లగా ఉండటంతో కాస్త ఉపశమనంగా ఉన్నట్టు ఆమె పేర్కొన్నది. ధోని భార్య చేసిన ట్వీట్ కు నెటిజన్లు రీట్వీట్ చేస్తూ వారి గోడును చెప్పుకుంటున్నారు.