పంచెకట్టులో మోడీ...జిన్ పింగ్ తో భేటీలో అదే స్పెషల్

పంచెకట్టులో మోడీ...జిన్ పింగ్ తో భేటీలో అదే స్పెషల్

చైనా అధ్యక్షుడు షీ జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురంలో చర్చలు జరపున్నారు. ఎప్పుడూ కుర్తా, పైజామా, హాఫ్ స్లీవ్ జాకెట్‌లో కనిపించే ప్రధాని మహాబలిపురం పర్యటనలో మాత్రం తమిళ సంప్రదాయంలోపంచె కట్టులో యూనిక్ లుక్‌లో మెరిశారు. శోర్‌ ఆలయ ప్రాంగణంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు తమిళ సంప్రదాయ వస్త్రధారణలో స్వాగతం పలికారు. ఇక జిన్‌పింగ్ కూడా పార్మల్ షర్ట్, ప్యాంట్‌తో సింపుల్‌గా కనిపించారు. అనంతరం మహాబలిపురంలోని షోర్ ఆలయాన్ని జింపింగ్‌కు చూపించారు. ఇద్దరు కలిసి యునెస్కో వారసత్వ సంపదైన మహాబలిపురం ఆలయ ప్రాంగణంలో కలియతిరిగారు.  ఆలయ విశిష్టత గురించి మోదీ.. జిన్‌పింగ్‌కు వివరించారు.  ఆ తర్వాత ఇద్దరూ కాసేపు కూర్చోని ట్రాన్స్ లెటర్స్ సహాయంతో మాట్లాడుకున్నారు. ఈ సమయంలో మోదీకి, జిన్‌పింగ్‌కు అధికారులు కొబ్బరినీళ్లను ఇవ్వగా ఇద్దరూ ఆ నీటిని తాగారు.